దేశంలో లాక్ డౌన్ ని ఏ విధంగా అమలు చేయాలన్న దాని పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు జారీచేసిందనే వార్త సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం జరుగుతోంది. దాని ప్రకారం, దేశంలో మొదటి విడుతలో ఒక రోజు, రెండో విడతలో 21 రోజులు, అనంతరం ఐదు రోజులు విరామం ఇచ్చి మూడో విడుతలో 28 రోజులు, ఆ తర్వాత ఐదు రోజుల విరామం అనంతరం మళ్లీ 15 రోజులు లాక్ డౌన్ విధిస్తారంటూ అందులో ఉంది. దాన్ని బట్టి మన దేశంలో 14 ఏప్రిల్ అనంతరం ఐదు రోజులు విరామం ఇచ్చి మళ్ళీ 28 రోజుల లాక్ డౌన్ ని విధిస్తారని చెప్తున్నారు. కాని, FACTLY విశ్లేషణ లో ఆ విషయం లో ఎటువంటి నిజం లేదని తేలింది. దేశంలో లాక్ డౌన్ ని ఏ విధంగా అమలు చేయాలన్న విషయం మీద తాము మార్గదర్శకాలేమీ జారీ చేయలేదని, అలాంటి వార్తలు నిరాధారమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://twitter.com/WHOSEARO/status/1246804406705614848
https://twitter.com/PIBFactCheck/status/1246808682806923265
https://twitter.com/hydcitypolice/status/1246990839974219776
The story first appeared here