పాకిస్తాన్ కి సంబంధించిన వీడియోని ‘ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా రోగుల దుస్థితి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

ఒక వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి ‘ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా రోగుల దుస్థితి’ అని దాని గురించి చెప్తున్నారు. ఆ వీడియో లో రోగులు హాస్పిటల్ వెలుపల బెడ్లు పై చికిత్స తీసుకుంటూ కనిపిస్తారు. అయితే, FACTLY విశ్లేషణ లో ఆ వీడియో పాకిస్తాన్ లోని ఒక హాస్పిటల్ కి  సంబంధించినదని, హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ ది కాదని తేలింది. 13 జూన్ 2020 న లాహోర్ లోని ‘సర్వీసెస్ హాస్పిటల్’ ఎమర్జెన్సీ వార్డ్ లో అగ్ని ప్రమాదం జరగడంతో రోగులను అందులో నుండి ఖాళీ చేయించారు. దాంతో వారిని బయటకి తరలించాల్సి వచ్చింది. వీడియో లోని విజువల్స్ అందుకు సంబంధించినవే. ఆ ఘటనకి సంబంధించి వివిధ వార్తా పత్రికలు రాసిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘గూగుల్ మాప్స్’ పై  ‘సర్వీసెస్ హాస్పిటల్’ (లాహోర్) కి సంబంధించిన ఫొటోల్లో పోస్టు చేసిన వీడియోలో కనిపించే బిల్డింగ్ ని పోలి ఉన్నట్టు కూడా గమనించవొచ్చు. కావున, వీడియో లో కనిపించేది హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో కరోనా రోగుల దుస్థితి కాదు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1.  ‘Gulf News’ కథనం – https://gulfnews.com/world/asia/pakistan/pakistan-video-of-patients-waiting-outside-after-lahore-hospital-catches-fire-causes-confusion-online-1.1592321600347
2. ‘The Nation’ కథనం – https://nation.com.pk/14-Jun-2020/woman-dies-during-evacuation-as-fire-erupts-in-services-hospital

Did you watch our new video?

The story first appeared here