73 రోజుల్లో ‘కోవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో ఫ్రీగా అందుబాటులోకి వస్తుందని ‘Serum Institute of India’ ప్రతినిధులు తెలుపలేదు

మరో 73 రోజుల్లో ‘కోవిషీల్డ్’  కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి  వస్తుందని పూణేకు చెందిన ‘ Serum Institute of India’ కంపెనీ ప్రతినిధులు తెలిపారు, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 73 రోజుల్లో ‘కోవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో ఫ్రీగా అందుబాటులోకి  వస్తుందని ‘ Serum Institute of India’ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఫాక్ట్ (నిజం): భారత ప్రభుత్వం తమకు ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ ఉత్పాదన చేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చిందని, 73 రోజుల్లో ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి  వస్తుందని కొన్ని మీడియా సంస్థలు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాయని ‘ Serum Institute of India’ కంపెనీ తమ ఫేస్బుక్ పేజిలో తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

‘University of Oxford’ మరియు ‘Astrazeneca’ కంపెనీ  సంయుక్తంగా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ (ChAdOx1 nCoV-19) వ్యాక్సిన్ ను భారతదేశంలో పెద్ద మోతాదులో ఉత్పత్తి చేయడానికి ‘Serum Institute of India’ కంపెనీకి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన ప్రకటన కోసం ‘Serum Institute of India’ కంపెనీ సోషల్ మీడియా అకౌంట్స్ లో వెతకగా, 73 రోజుల్లో ‘కోవిషీల్డ్’  కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని కొన్ని మీడియా సంస్థలు ప్రజలని తప్పు దోవ పట్టిస్తున్నాయంటూ, ఆ కంపెనీ తమ ఫేస్బుక్ పేజిలో పెట్టిన పోస్ట్ దొరికింది. భారత ప్రభుత్వం తమకు ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ ఉత్పాదన చేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చిందని, మూడవ దశ ట్రయల్స్ విజయవంతం అయ్యాకే ఈ వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఆ పోస్టులో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ కంపెనీ తమ ట్విట్టర్ అకౌంట్లోను ట్వీట్ చేసింది.

భారత దేశంతో సహా పేద-మధ్య తరగతి దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ చౌక ధరలకే అందుబాటులోకి తేవడానికి ‘Serum Institute of India’ కంపెనీ, ‘Gavi’ అనే వ్యాక్సిన్ అలయన్స్ సంస్థతో మరియు ‘Bill & Melinda Gates Foundation’ తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘University of Oxford’  తయారు చేసిన ‘కోవిషీల్డ్’ మరియు అమెరికాకి చెందిన ‘NOVAVAX’ కంపెనీ తయారు చేసిన ‘NVX-CoV2373’ వ్యాక్సిన్లను ‘Serum Institute of India’ కంపెనీ తయారు చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం 100 మిలియన్ల వాక్సిన్ డోసులను 92 దేశాలకు సరిపడేంతగా ఈ కంపెనీ తయారు చేయనుంది.

‘Serum Institute of India’ కంపెనీ తయారు చేస్తున్న ఈ వాక్సిన్ ధర గరిష్టంగా 3 డాలర్లు ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు ఈ వ్యాక్సిన్ ని నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఉచితంగా అందిస్తున్నట్టు భారత ప్రభుత్వం ఇప్పటివరకూ ఎక్కడా ప్రకటించలేదు.

చివరగా, 73 రోజుల్లో ‘కోవిషీల్డ్’  కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి  వస్తుందని ‘Serum Institute of India’ ప్రతినిధులు తెలుపలేదు.

The story first appeared here