హైదరాబాద్‌లో BGUS కార్యకర్తల అరెస్టుపై శ్రీ బండి సంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టించే ట్వీట్

క్లెయిమ్ : గణేష్ నిమజ్జన ఏర్పాట్లు డిమాండ్ చేసినందుకు BGUS కార్యకర్తలను అరెస్టు చేశారని శ్రీ బండి సంజయ్ ట్విట్టర్‌లో ఆరోపించారు.

 

ఫాక్ట్ (నిజం):ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు BGUS కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అందువల్ల ఇది తప్పుడు క్లెయిమ్.

శాంతియుతంగా నిమజ్జనం చేయాలని, సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసినందుకు భాగ్య నగర్ ఉత్సవ్ సమితి (బిజియుఎస్) కార్యకర్తలను అరెస్టు చేసినట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించినందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం. సిటీ పోలీస్ చట్టం ప్రకారం ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి అవసరం. ఎలాంటి ఉల్లంఘన అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున, అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

విగ్రహాల తయారీదారులకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది, హుస్సేన్ సాగర్ కాకుండా ఇతర ప్రదేశాలలో POP విగ్రహాలను నిమజ్జనం చేయాలని వారిని కోరింది. నిజానికి పోలీసుల అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు బీజీయూఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ నిమజ్జన ఏర్పాట్లు డిమాండ్ చేసినందుకే కార్యకర్తలను అరెస్టు చేశారని శ్రీ బండి సంజయ్ ట్విట్టర్‌లో ఆరోపించారు.

వాస్తవానికి నిమజ్జనానికి అన్ని అధునాతన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. శాంతియుతంగా నిమజ్జనం చేసేందుకు 31 సరస్సులు, 74 బేబీ పాండ్‌లు, 280 క్రేన్లు, 130 మొబైల్ క్రేన్లు, 10 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించబోమని జులై 21, 2022 నాటి ఉత్తర్వులో కోర్టు ప్రత్యేకంగా పేర్కొంది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తోంది. అయితే, వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు నగరంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

న్యాయస్థానం యొక్క ఉత్తర్వును కింద ఇవ్వడం జరిగింది.

Click here to view PDF

 

చివరగా చెప్పాలంటే శ్రీ బండి సంజయ్ గారు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు.