దేశంలో లాక్ డౌన్ ని 4 మే వరకు పొడగిస్తున్నట్లుగా ప్రధాని మోడీ ఇప్పటివరకైతే ప్రకటించలేదు

Lockdown-till-May-4th-Fakenews

దేశంలో 14 ఏప్రిల్ వరకు అమలులో ఉన్న లాక్ డౌన్ ని మే 4వ తేదీ వరకు పొడగిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారనే వార్త ని సోషల్ మీడియా చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

4-May-lockdown-fb-post

క్లెయిమ్: దేశంలో లాక్ డౌన్ ని 4 మే వరకు పొడగిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

ఫాక్ట్ (నిజం): దేశం లో 14 ఏప్రిల్ వరకు అమలులో ఉన్న లాక్ డౌన్ ని 4 మే వరకు పొడగిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ వార్త తో ఉన్న ‘India Today’ న్యూస్ ఛానల్ ఫోటో ఎడిట్ చేసినది. కావున, పోస్ట్ లో చెప్పిందితప్పు.

ప్రధాని నరేంద్ర మోడీ భారత్ లో కొరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశం వ్యాప్తంగా 14 ఏప్రిల్ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా 24 మార్చి న ప్రకటించారని ఇక్కడ చూడవొచ్చు.

ఆ లాక్ డౌన్ ని ప్రధాని మోడీ 4 మే వరకు పోడగిస్తున్నట్లుగా ప్రకటించాడా అని వెతికినప్పుడు, ఆ వార్త తో న్యూస్ రిపోర్ట్స్ ఏవీ లభించలేదు. ఒక వేల ప్రధాని ఆ ప్రకటన చేసి ఉంటే దేశం లోని అన్ని వార్త పత్రికలు రాసేవి. కావున, ఆ వార్త తప్పు. పోస్టు లోని ఇమేజ్ లో ఆ వార్త ని ‘India Today’ న్యూస్ ఛానల్ ప్రసారం చేసినట్లుగా ఉంది. దాంతో, ప్రధాని నరేంద్ర మోడీ 14 ఏప్రిల్ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా 24 మార్చి న ప్రకటించినపుడు ‘India Today’ చేసిన ప్రసారాన్ని చూసినప్పుడు, ఆ వీడియో లోని విజువల్ యొక్క స్క్రీన్ షాట్ ని ఎడిట్ చేసినట్లుగా స్పష్టమవ్తుంది. ఆ ప్రసారం లో 10:36 నిడివి దగ్గర పోస్టులోని ఇమేజ్ లో ఉన్న విజువల్ ని చూడవచ్చు. వాటిల్లో ఉన్న ఫాంట్ మరియు బ్యాక్ గ్రౌండ్ ని పోల్చినప్పుడు, చాలా తేడాలు కనిపిస్తాయి

Lockdown-till-May-4th-Comparison-768x384

ఇలాంటి వార్తనే ఇంతకముందు వైరల్ అయినప్పుడు, ‘Prasar Bharati News Services’ వారు కాబినెట్ సెక్రటరీ తో మాట్లాడగా, లాక్ డౌన్ పొడిగించే ప్లాన్ లేదని తెలిపారు.

Prasar Bharati News Services

@PBNS_India

FAKE NEWS ALERT 🚨

PBNS got in touch with the Cabinet Secretary on this news article.

The Cabinet Secretary expressed surprise & said that there is no such plan of extending the lockdown. https://twitter.com/ThePrintIndia/status/1244453308959342594 

3,024 people are talking about this

చివరగా, దేశం లో లాక్ డౌన్ ని 4 మే వరకు పొడగిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు.

The story first appeared here