బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన 10 చెక్ డ్యాంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం నిజమేనా?

బాల్కొండ నియోజకవర్గంలో 10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పిన తప్పుడు సమాచారంతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ పోస్టులో తెలుపుతున్న వివరాలలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

క్లెయిమ్ : బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన 10 చెక్ డ్యాంలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత మాత్రం లేదు.
ఫాక్ట్( నిజం) : 10 చెక్ డ్యామ్‌లలో 4 నాబార్డ్ (NABARD) నుండి రుణం తీసుకుని నిర్మించబడ్డాయి మరియు ఆరింటికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చింది. నాబార్డు(NABARD) రుణాలు వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తాం కాబట్టి, ధర్మపురి అరవింద్ చేసిన వాదన తప్పు.

పోస్టులో క్లెయిమ్ చేసిన వివరాల కోసం సేకరించిన సమాచారం ప్రకారం బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 27 చెక్ డ్యాంలు ఉన్నాయి. అందులో నుండి ధర్మపురి అరవింద్ పేర్కొన్న 10 చెక్ డ్యామ్‌ల వివరాలను సేకరించాము.

వివరాలు క్రింద పేర్కొనబడ్డాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పడినపుడు మంజూరు చేసిన చెక్ డ్యామ్‌ల జాబితా ఈ క్రింది విధంగా ఉంది తెలంగాణలో బాల్కొండ నియోజకవర్గంలో 27 చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయి అందులో 4 నాబార్డ్ (NABARD) ద్వారా నిధులు పొందాయి. మిగిలిన 6 చెక్ డ్యామ్‌లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.

వాస్తవాలతో కూడిన ఒక వీడియో ను బాల్కొండ ఎమ్మెల్యే, రోడ్లు, భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి & తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు విడుదల చేశారు. చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించిన నిధులపై ఆయన స్పష్టత ఇచ్చారు. చెక్ డ్యాంలు మరియు కేంద్ర నిధుల మీద శ్రీ ధర్మపురి అరవింద్ చెప్తున్న సమాచారం తప్పు అని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. కింద ఆ నోట్ ను చూడవచ్చు.

సంగ్రహంగా చెప్పాలంటే, శ్రీ ధర్మపురి అరవింద్ చేసిన వాదన తప్పు